NTR: జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శ్రీకారం చుట్టారు. డీఎల్ఎఫ్ నిధులతో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు రూ.1.50 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో చేపట్టే డ్రైనేజీ పనులను ప్రారంభించారు.