ADB: రైతులు అధైర్యపడవద్దు.. తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.