BPT: ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ‘ఉల్లాస్-అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గత ఏడాది లక్ష్యానికి మించి 66,023 మంది వయోజనులను అక్షరాస్యులను చేశామని ఆయన గుర్తుచేశారు.ఈ ఏడాది జిల్లాలో కొత్తగా మరో 63,550 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.