కడప జిల్లా కాసినాయన మండలం మిద్దెల గ్రామానికి చెందిన ఎర్రబల్లి మద్దయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడికి ఇంకా వివాహం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.