TG: హైదరాబాద్లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో పలు పబ్బుల్లో అర్ధరాత్రి ఈగల్ బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే, కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా.. 8 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పీఎస్కు తరలించారు.