MHBD: కొత్తగూడ మండలం పొగళ్లపల్లి గ్రామ రహదారి మృత్యుపాశంలా మారింది. నెలల క్రితం రోడ్డు మరమ్మతుల కోసం కంకర పోసి, అలాగే వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు రెండు, మూడు వాహనాలు అదుపుతప్పి కిందపడి గాయాల పాలవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.