AP: అప్పుడు నాయకులు ఉన్నట్లుగానే, తప్పుడు అధికారులు ఉన్నారని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. నిఖార్సైన పోలీసులను తాను ఎప్పుడూ బెదిరించలేదని.. అధికార పార్టీకి తొత్తులుగా మారిన పోలీసు అధికారులనే బెదిరించానని పేర్కొన్నారు. కృష్ణాజిల్లాలో అందరూ జైపాల్(జిల్లా పోలీసు అధికారుల సంఘం చీఫ్) లాంటి అధికారులే ఉండరు కదా? అని చెప్పారు. తనకు కొత్తగా పబ్లిసిటీ అవసరమా? అని ప్రశ్నించారు.