MBNR: ధర్మాపూర్ కపిలాద్రి క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం, గరుడ వాహన సేవలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై దర్శనమివ్వగా భక్తులు భారీగా తరలివచ్చి హారతులు సమర్పించారు. అనంతరం నిర్వహించిన రథోత్సవం అర్ధరాత్రి వరకు వైభవంగా కొనసాగి భక్తులను ఆకట్టుకుంది. హనుమద్దాసుల భజన మండలి భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.