NRML: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంజా గస్తీ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ బస్టాండ్ వద్ద గంజాయి సేవిస్తే జరిగే అనర్ధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, గంజాయి మొక్కలు పెంచిన తమకు సమాచారం అందించాలని కోరారు.