ATP: సీఎం చంద్రబాబు ఈనెల 6న యాడికి పట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ కోసం కేటాయించిన స్థలాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.