BHNG: గుండాల మండల కేంద్రం నుంచి గంగాపురం గ్రామానికి వచ్చే రహదారి అధ్వానంగా మారిందని, రోడ్డు సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.