ASR: జీకే వీధి మండలంలో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారి మబ్బులు కమ్ముకొని వర్షం ప్రారంభమైంది. సుమారు రెండు గంటల పాటు కురిసిన ఈ వర్షానికి చాపగెడ్డ రహదారిపై చెట్టు కూలింది. దీంతో అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.