కోనసీమ: ముమ్మిడివరం ఎంపీడీవో దీక్షితులు అనాతవరం, చెయ్యేరు గున్నేపల్లి, అయినాపురం గ్రామాలకు ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. మూడు గ్రామాలకు శుక్రవారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉద్యోగులతో మాట్లాడుతూ.. పంచాయతీకి వచ్చే ప్రజలకు సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. ఆలస్యం కాకుండా పనులు పూర్తి చేయాలన్నారు.