TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడంతో గతంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. యాదగిరిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో యాదగిరిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడగా.. కాసేపట్లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.