AP: పల్నాడు SP కార్యాలయ ఘటనపై నరసరావుపేట MLA చదలవాడ అరవిందబాబు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటనపై CM చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఏవైనా సమస్యలుంటే ఇంఛార్జి మంత్రి లేదా పార్టీతో సమన్వయం చేసుకోవాలన్నారు.