VZM: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక & వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ తెలిపారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జేసీ ఎస్. సేధు మాధవన్‌లతో కలిసి రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలోని ఏపీఐఐసీ భూములను శుక్రవారం పరిశీలించారు. అభివృద్ధికి అనుకూలంగా భూముల వినియోగంపై సమగ్రంగా పరిశీలించాలన్నారు.