PLD: చిలకలూరిపేటలోని రెండు రేషన్ దుకాణాలపై సోమవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో భారీగా సరుకులు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. వేలాది కిలోల బియ్యం, జొన్నలు, చక్కెర నిల్వలు మాయమైనట్లు తేలింది. అక్రమంగా నిల్వ ఉంచిన సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డీలర్లపై 6-ఏ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.