ASF: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సిర్పూర్ టీ ఎస్ఐ డీ.సాగర్ ప్రకటనలో తెలిపారు. SI వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని పెద్దబండ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బొలెరో వాహనంలో పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు.