SRD: కంగ్టి మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం కొత్త బోరు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి సుభాష్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ పరిసరాలలో ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయని, మండలంలోని ప్రజలు తమ అత్యవసర పనులపై వస్తారని చెప్పారు. ప్రజల తాగునీటి వసతి కోసం కొత్త బోరు వేస్తున్నట్లు చెప్పారు. ఇందులో అధికారులు ఉన్నారు.