AP: రాజధాని కోసం జగన్ చేసిన ‘మావిగన్’ ప్రతిపాదనపై గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జగన్ మానసిక స్థితి బాగోలేదు. అందుకే రాజధానిపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు 3 రాజధానులంటూ విశాఖలో ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు మావిగన్ అంటూ టర్న్ తీసుకున్నారు. 11 సీట్లకే పరిమితమయ్యాక కూడా మారకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. ఇలా అయితే మున్ముందు YCP కనుమరుగవడం ఖాయమన్నారు.