GNTR: కాకుమాను మండలం కొమ్మూరుకు చెందిన షేక్ రేష్మ ఏపీ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2024లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆమె, తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. రేష్మ ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమెను పలువురు ప్రముఖులు అభినందించారు.