MHBD: మరిపెడ మున్సిపాలిటీ 3,14వ వార్డులలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. నిత్యం మరిపెడ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుతూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ప్రజలు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.