NGKL: లింగాల మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. లింగాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నారాయణ గౌడ్‌ను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లామని సూచించారు.