NLG: యాసంగి సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో కట్టంగూరు మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. రైతులు తమ కష్టార్జితాన్ని విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం మండలంలో భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నకిరేకల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోనే అత్యధికంగా 24 కేంద్రాలను ఈ మండలంలోనే నెలకొల్పడం విశేషం. మండలంలో 23,400 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.