HNK: కాకతీయ యూనివర్సిటీలో దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యుడు రాజు గౌడ్, అధ్యాపకులు పూలమాల వేసి నివాళులర్పించారు. బానిస సంకెళ్లు తెంచుకోవడానికి ప్రాణాలనే పణంగా పెట్టిన మహావీరుడు కొమురయ్య అని, వారి త్యాగం ఎప్పటికీ ఆరిపోని విప్లవ జ్వాల అని రాజుగౌడ్ అన్నారు.