SRPT: నడిగూడెం తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సోమపంగు సూరయ్య ప్రస్థానం అందరికీ స్ఫూర్తినిస్తోంది.1995లో తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద అదే కార్యాలయంలో అటెండర్‌గా ఆయన వృత్తి జీవితం ప్రారంభించారు.పట్టుదలతో విద్యా అర్హతలు పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. నేడు అదే కార్యాలయంలో తాహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు.