KMR: బీర్కూరులో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు సర్పంచ్ ధర్మతేజ తెలిపారు. తొలిరోజు రథోత్సవం, రెండో రోజు కుస్తీ పోటీలు, ఎడ్లబండ్ల ఊరేగింపు ఉంటాయని వివరించారు. ఈ వేడుకలకు పరిసర ప్రాంతాల మల్లయోధులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.