TPT: శుక్రవారం ఏపీఆర్జేసీ,పాలిసెట్ ఉచిత నమూనా పరీక్షలు వరదరాజనగర్ విశ్వవిద్యాసంస్థల్లో నిర్వహించనున్నట్లు సంస్థల అధినేత విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఈనెల 24న APRJC, 25న పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తుకు APRJC కోసం 7వ తేదీ, పాలిటెక్నిక్ కోసం 4వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నమూనా పరీక్షలు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.