TG: PCC చీఫ్ మహేష్ కుమార్ ఇవాళ్టి నుంచి మళ్లీ జిల్లాల్లో పర్యటించనున్నారు. నాలుగు జిల్లాల్లో డీసీసీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మంచిర్యాలలో సమావేశం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ పాల్గొననున్నారు. అనంతరం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్‌కు వెళ్లనున్నారు.