దక్షిణ మధ్య రైల్వే(SCR) జోన్ చరిత్రలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆధిక ఆదాయం నమోదైనట్లు జోన్ జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో SCRకు మొత్తం రూ.21,211.92 కోట్ల స్థూల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. సరకు రవాణా ద్వారా రూ.13,835.27 కోట్లు, ప్రయాణాల ద్వారా రూ.6,235.37 కోట్లు, మిగతా ఆదాయం ఇతర మార్గాల ద్వారా వచ్చినట్లు GM వివరించారు.