WGL: దేశవ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని వరంగల్ MP కడియం కావ్య కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా దుర్వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి, ఆన్లైన్లో విషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో విభేదాలు పెరుగుతున్నాయని తెలిపారు.