ఛత్రపతి శివాజీ మరణం తర్వాత జరిగిన ఓ ఊహించని ఘటన ఆయన పెంపుడు కుక్క ‘వాఘ్యా’ త్యాగం. తన యజమాని చితి మంటల్లో కాలిపోతుండటం చూడలేక.. వాఘ్యా కూడా ఆ చితిలోకి దూకి ప్రాణాలు వదిలిందని చరిత్ర చెబుతోంది. దీనికి గుర్తుగా రాయగఢ్ కోటపై శివాజీ సమాధి పక్కనే వాఘ్యా విగ్రహాన్నీ ఏర్పాటు చేశారు. ఏనాటికైనా శునకాన్ని ఉండే విశ్వాసం ఏ జంతువుకూ ఉండదని ఈ ఘటన మరోసారి ఋజువు చేస్తోంది.