TG: ఇప్పటికే ప్రతి నెల ఒకటో తారీఖున ఠంచనుగా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అదే రోజున జీతాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే బిల్లులు చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం.