పెద్దపల్లి జిల్లా ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడిగా గాజర్ల అమర్నాథ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమ్మయ్య శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమ్మయ్య, అమర్ నాథ్‌కు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.