కోనసీమ: జిల్లాలో అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఈ నెల 26న ఆదివారం సెలవు రోజు అయినా విద్యుత్ బిల్లులు యథావిధిగా కట్టించుకోవడం జరుగుతుందని జిల్లా APEPDCL ఎస్ఈ ఎస్.రాజేశ్వరి శనివారం తెలిపారు. అదే విధంగా సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆమె తెలిపారు.