TG: చేనేత కార్మికులను రేవంత్ సర్కార్ వంచిస్తోందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. విద్యాశాఖ యూనిఫామ్ ఆర్డర్లను రద్దు చేయడం, రూ. 200 కోట్ల విలువైన ఇతర ఆర్డర్లను టెస్కోకు ఇవ్వకపోవడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ కుట్ర అని, వెంటనే నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.