TG: కాంగ్రెస్ సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అసెంబ్లీ సమావేశాలను వాడుకుందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. కేవలం ఆరు రోజులే సభ నిర్వహించి, ప్రజా సమస్యలపై చర్చను పక్కనపెట్టారని ఆరోపించారు. మంత్రుల గైర్హాజరీ, గంటల తరబడి సభ వాయిదాలు సభ పవిత్రతను దెబ్బతీశాయన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు.