ASF: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అందజేశారు. రెబ్బెన పోలీసులు CEIR పోర్టల్ ద్వారా గాలింపు చేపట్టారు. బోగే ఉపేందర్, దొమ్మటి ప్రవీణ్, శంకర్ తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గుర్తించిన పోలీసులు, వాటిని ఆయా బాధితులకు అప్పగించారు.