PLD: కారంపూడి మండలంలో ఇంటి పన్నుల వసూళ్లను ముమ్మరం చేసినట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే 63 శాతం వసూళ్లు పూర్తయ్యాయని, మార్చి 31 నాటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, పన్ను చెల్లింపుదారులకు అవగాహన చేస్తున్నామని పేర్కొన్నారు.