పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మార్చి 19న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా టికెట్ బుకింగ్స్‌పై తాజాగా చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. నైజాంలో ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.