డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ‘ఆపరేషన్ సింధూర్’ మూవీ ఖరారైంది. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 పహల్గాం ఉగ్రదాడికి భారత్ తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ తర్వాత వివేక్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.