NDL: ప్యాపిలి మండలం రామకృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో సీఆర్పీఎఫ్ జవాన్ మధుషావలి తన సొంత నిధులతో పాఠశాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారు. పాఠశాల రూపురేఖలు మార్చిన సేవలకు గుర్తింపుగా గురువారం సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కలిసి ఆయనను సన్మానించారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.