NDL: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం సానుకూలంగా ఉండేలా చూడాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు. వైద్యుల కొరత, మరుగుదొడ్ల నిర్వహణ, గ్యాస్ అక్రమ వసూళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తక్కువ సంతృప్తి ఉన్న మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆమె అధికారులకు స్పష్టం చేశారు.