గుంటూరులో అధికారులతో కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్షించారు. లక్ష్య సాధనకు పక్కా ప్రణాళికలు ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కొండవీటి, పీకలవాగుల వరదల నివారణకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఇంటింటికి తాగునీరు అందించాలని, రాజధాని నిర్మాణ పనులకు మెటీరియల్ కొరత లేకుండా చూడాలని, ఈ నెల 7న జరిగే సీఎం సమీక్షకు అధికారులు సన్నద్ధం కావాలని చెప్పుకొచ్చారు.