పశ్చిమాసియా యుద్ధం వల్ల ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాటి ధరలు 200-300% పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180% పెరుగుతాయని తెలుస్తోంది. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్‌న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.