CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజు స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సత్యనారాయణ వ్రతం, రాత్రి గరుడ వాహనంపై గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.