AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పెద్ద బొడ్డేపల్లి ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రత్నాకర్ ఆధ్వర్యంలో భక్తులు క్రీస్తు సిలువ పాటులను స్మరిస్తూ ఊరేగింపు నిర్వహించారు. పురవీధుల్లో ప్రదర్శన అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు మానవుల రక్షణ కోసం తన ప్రాణత్యాగం చేశారని ఫాదర్ రత్నాకర్ తెలిపారు.