SRH నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనను KKR దూకుడుగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే 25 పరుగులు చేసింది. మూడు ఫోర్లు, రెండు సిక్సులతో ఫిన్ ఆలెన్ విరుచుకుపడ్డాడు. అయితే, 1.3 ఓవర్లో హర్ష్ దుబే బౌలింగ్లో ఆలెన్ (28) ఔటయ్యాడు. రెండు ఓవర్లకు కేకేఆర్ స్కోరు 33-1. అజింక్య రహానె (2), రఘువంశీ (1) క్రీజులో ఉన్నారు.