AP: నూతనంగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు మాజీ సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ గెలుపునకు సహకరించిన ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులను అభినందించిన జగన్.. న్యాయవాదుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ.. వ్యవస్థపై నమ్మకం పెంచేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.