MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామసభలో హెచ్ఎం మోహన్ పాఠశాల సమస్యలను వివరించారు. 1–5 తరగతులు ఒకే గదిలో జరుగుతున్నాయని, అదనపు గది అవసరమని తెలిపారు. పాఠశాల స్థలం ఆక్రమణ, అసాంఘిక కార్యకలాపాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ గోడ, అదనపు గదుల నిర్మాణం కోరుతూ సర్పంచ్ మాధవికి వినతి అందజేశారు.